Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్ జలాశయం 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో కూడా 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 306.10 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 14 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,91,936 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీకు గాను ప్రస్తుతం 8.300 టీఎంసీలుగా ఉన్నది.
ఇవి కూడా చదవండి..
Suryapet | అదును దాటుతున్నా నీళ్లేవీ?.. సూర్యాపేటలో కాళేశ్వరం ఆయకట్టు ప్రశ్నార్థకం
Congress Govt | కమిటీ వేసెయ్.. కాలరాసెయ్.. సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు స్కెచ్!
Sunkishala Project | సుంకిశాలపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం.. కూలిన ఘటన మా వరకు రాలేదన్న మంత్రులు