New Ration Cards | హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. శనివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు దామోదర రాజానరసింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఖరారు చేయనుంది.
ఆగస్టు 1వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Israeli | గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 100 మంది మృతి
Karimnagar | మెట్పల్లిలో పోలీసుల అత్యుత్సాహం.. మహిళపై లాఠీ ఝులిపించారు.. వీడియో
Runa Mafi | ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలే.. అధికారులపై ఎమ్మెల్యే కడియం ఆగ్రహం