BVRIT | బీవీఆర్ఐటీలో ఇంటర్య్వూలు.. విద్యా పర్యటనలో పాల్గొన్న విద్యార్థులు
BVRIT | ఎం బాజా సే ఇండియా- 2026 పోటీలు నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగాయి. ఐదవ రోజు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన హెచ్ ఆర్ మీట్ కార్యక్రమం సోమవారం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలతో విద్యార్ధుల అనుసంధానం మరింత బలపడింది.
BVRIT | నర్సాపూర్, మార్చి2: నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో సోమవారం బాజా సే ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎం బాజా సే ఇండియా- 2026 పోటీలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 వరకు బీవీఆర్ఐటీ కళాశాలలో నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగాయి. ఐదవ రోజు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన హెచ్ ఆర్ మీట్ కార్యక్రమం సోమవారం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలతో విద్యార్ధుల అనుసంధానం మరింత బలపడింది.
దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిభావంతులైన యువ ఇంజనీర్లతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రముఖ సంస్థలైన జేకే టయర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీవీఎస్ మోటర్ కంపెనీ, వర్రోక్ నియామక ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎం బాజాలో పాల్గొన్న ప్రతీ విద్యార్థి బాజా అస్సెస్మెంట్ టెస్ట్ అనే సమగ్ర పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సాధించిన ప్రతిభ ఆధారంగా సంస్థలు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఆన్లైన్ అంచనాలు, గ్రూప్ డిస్కర్షన్, సాంకేతిక ఇంటర్వ్యూలు, హెచ్ ఆర్ ఇంటర్వ్యూల వంటి పద్ధతి ద్వారా నియామక దశలకు ఆహ్వానించాయి.
ఈ సందర్భంగా బాజా సే ఇండియా జాయింట్ కన్వీనర్ డా. మురళీకృష్ణ మాట్లాడుతూ.. హెచ్ఎర్ మీట్ ద్వారా పరిశ్రమలకు ఇప్పటికే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిద్ధమైన ప్రతిభావంతులైన అభ్యర్ధుల సమూహం లభించిందని వెల్లడించారు. ఫలితంగా విద్యార్థులు ఉద్యోగావకాశాల కోసం మాత్రమే కాకుండా నేరుగా పరిశ్రమల్లో స్థానం సంపాదించే అవకాశం పొందుతున్నారని అన్నారు.
విద్యార్థుల విద్యా పర్యటన..
నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలను శివంపేట్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 100 మంది విద్యార్థులు అలాగే 10 మంది అధ్యాపకులు సోమవారం సందర్శించారు. విద్యార్థులను రెండు బ్యాచులుగా విభజించి తద్వారా ప్రతీ విద్యార్థికి అన్ని సౌకర్యాలను సమగ్రంగా వీక్షించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధ్యాపకులకు కళాశాలలోని ప్రయోగశాలలను పరిచయం చేశారు. ఈసీఈ, ఈఈఈ, బీఎంఈ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు పర్యవేక్షణలో ఈ పర్యటన అత్యంత సజావుగా జరిగింది.
ఈ పర్యటనలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య పట్ల ఆసక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడిందని, కళాశాల అత్యాధునిక ప్రయోగశాలలు విద్యార్థులలో వినూతన ఆలోచనలను రేకెత్తించాయని ఈ విద్యా పర్యటన విద్యార్థుల భవిష్యత్ కేరీర్ ఆకాంక్షలకు ప్రేరణగా నిలుస్తుందని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజయ్లూబే, బాజా సే భారతదేశ సలహాదారు డా.కే.సి వోరా. డైరెక్టర్ డా. కె. లక్ష్మీప్రసాద్, మేనేజర్ బాపిరాజు పాల్గొన్నారు.



Read Also :
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

