Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Balka Suman Bail | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరయ్యింది.
మంచిర్యాల : అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) కు బెయిల్ ( Bail ) మంజూరయ్యింది. కోర్టు రూ. 25వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఉదయం బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ను వాయిదా వేసిన కోర్టు సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది.
అధికార కాంగ్రెస్ పార్టీ బాల్కసుమన్కు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుపడింది. బెయిల్ పిటిషన్‌పై మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్టులో అప్పీల్ చేయించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన జిల్లా కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇక బెయిల్ పిటిషన్‌పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించింది. గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ అగ్ర నాయకులు పరామర్శించి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందింది. అయితే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ అడ్డుకుని చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు బనాయించి జైలులో బంధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- bail
- Balka Suman
- court
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

