TGSRTC | మహిళలకు శుభవార్త.. ఆర్టీసీ కార్గోలో రాఖీలు.. 24 గంటల్లో చేరేలా చర్యలు
TGSRTC | ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
TGSRTC | హైదరాబాద్ : ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా పంపే అవకాశం కల్పించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్గో అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. రాఖీల రవాణకు సంబంధించిన ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Zoetis Inc | హైదరాబాద్‌లో కేపబులిటీ సెంటర్‌ను విస్తరించనున్న జొయిటిస్.. వందలాది మందికి ఉద్యోగాలు
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
Karimnagar | మెట్పల్లిలో పోలీసుల అత్యుత్సాహం.. మహిళపై లాఠీ ఝులిపించారు.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

