RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. అయినా విషాహారం సంఘటనలు మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారూ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మీ అసమర్థత బయటకు వస్తదనే కదా గురుకుల బాటలో మేము పాఠశాలలను తనిఖీ చేస్తే మా మీద కేసులు పెట్టి మీ మతిలేని మంత్రులను, ఎమ్మెల్యేలను మా పై ఉసిగొల్పిండ్రు? మీకు చేతకాక పోతే గద్దె దిగండి కానీ, దయచేసి మా పేద పిల్లలను విషాహారంతో చంపకండి అని రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నరు, అయినా విషాహారం సంఘటనలు మళ్లీ ఎందుకు జరుగుతున్నయి సీయం @revanth_anumula గారూ?
మీ అసమర్థత బయటకు వస్తదనే కదా గురుకుల బాటలో మేము పాఠశాలలను తనిఖీ చేస్తే మా మీద కేసులు పెట్టి మీ మతిలేని మంత్రులను, ఎమ్మెల్యేలను మా పై ఉసిగొల్పిండ్రు?
మీకు చేతకాక పోతే… pic.twitter.com/b178cOgKQE— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 11, 2024
ఇవి కూడా చదవండి..
Mohanbabu | నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట
KTR | నందిని సిధారెడ్డి ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం : కేటీఆర్
KTR | వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ..! దాచేస్తే దాగని సత్యాలు ఇవి..! కేటీఆర్ ట్వీట్