KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రతి రైతును గుండెల్లో పెట్టి చూసుకున్నారు. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే.. చివరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు.. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు. దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించారు కేసీఆర్. అన్నదాతకు అండగా నిలిచి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు బీఆర్ఎస్ అధినేత. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. అయినా తాము రైతులకు అండగా నిలబడ్డాం.. మా ఏడాది పాలనలో రైతులు ఎంతో పురోగతి చెందారన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని ఎక్స్ వేదికగా కేటీఆర్ వివరించారు.
వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ..! సాగును సంబురం చేయడమంటే ఇదీ..! దాచేస్తే దాగని సత్యాలు ఇవి..! తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుతాలివి..! 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో వ్యవసాయం, సాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజా గణాంకాలే నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.
2013-14లో 78 లక్షల 18 వేల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పిస్తే.. 2022-23 నాటికి కోటి 60 లక్షల ఎకరాలకు సాగునీరు(రెండు పంటలకు) అందించినట్లు కేటీఆర్ తెలిపారు. 2013-14లో కోటి 55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. 2022-23 నాటికి 2 కోట్ల 29 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందని గుర్తు చేశారు. ఆహార పంటల ఉత్పత్తికి సంబంధించి 2013-14లో 2 కోట్ల 25 లక్షల టన్నులు పండిస్తే.. 2023-24 లో 5 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించింది. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతుబంధు సహా అనేక వ్యవసాయ అనుకూల విధానాల ఫలితాలు ఇవి! చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ!
సాగును సంబురం చేయడమంటే ఇదీ!
దాచేస్తే దాగని సత్యాలు ఇవి!
తొమ్మిదున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుతాలివి!
2013-14 నుంచి 2022-23మధ్య కాలంలో వ్యవసాయం,సాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజా గణాంకాలే నిదర్శనం!… pic.twitter.com/4Xmj3wUnvO
— KTR (@KTRBRS) December 11, 2024
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | అది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత విమర్శ
జగిత్యాల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
Mancherial | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మంచిర్యాలలో విషాదం