MLC Kavitha | జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలని.. వాటి పరిస్థితులపై సమీక్ష చేసి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను వెంటనే జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినిలకు అస్వస్థత
జగిత్యాల – సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థినిలు
జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలింపు.. విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది… pic.twitter.com/pMcjbuz9rN
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024