KTR | హైదరాబాద్ : ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందిని సిధారెడ్డి ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు మీరు చూపిన నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో మీ మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, మరియు ఆత్మగౌరవానికి చెరగని మచ్చ. సంస్కృతి ని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డిగారు తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త…
— KTR (@KTRBRS) December 11, 2024
ఇవి కూడా చదవండి..