Mohanbabu | హైదరాబాద్ : నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మోహన్‌బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. పోలీసుల నోటీసులపై స్టే కోరుతూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 24వ తేదీ వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక మోహన్‌బాబుపై నమోదైన కేసులను కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. జర్నలిస్టుపై దాడి కేసులో మరో క్రిమినల్ కేసు నమోదైందన్నారు. నోటీసులు అందుకున్న మనోజ్ ఇవాళ విచారణకు వచ్చారు. మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మోహన్‌బాబు ఇంటి వద్ద నిరంతరం పోలీసు గస్తీ ఏర్పాటు సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు గంటలకు ఒకసారి పోలీసులు చూసి వస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు వరల్డ్‌వైడ్‌గా సూపర్ క్రేజ్.. గూగుల్ సెర్చ్‌లో టాప్ ర్యాంక్..!
KTR | నందిని సిధారెడ్డి ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం : కేటీఆర్