Film Journalist Murthy | ప్రముఖ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ ముర్తి (అలియాస్ తాత, అలియాస్ దేవి ప్రియ)ని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. అసోసియేషన్ కార్యక్రామాలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తున్నందుకు సాయిరాజ్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు టీఎఫ్జేఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫిల్మ్ జర్నలిస్టు సూర్య నారాయణ ముర్తి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అనేది తెలిసిందే. మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సెలబ్రిటీలను ఆయన అడిగే క్వశ్చన్స్ చాలాసార్లు ట్రోలింగ్‌కు గురవడం గమనించే ఉంటారు. ఇక ప్రమోషనల్ ఈవెంట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా దేవి ప్రియ పేరిటా ఏ పోస్ట్ పడితే ఆ పోస్ట్ పెడుతూ ఉంటాడు. అయితే తాతాగా పాపులర్ అయిన మూర్తి తాజాగా సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది. అసోసియేషన్ కార్యక్రామాలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తున్నందుకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అతడిని 6 నెలలు సస్పెండ్ చేసినట్లు ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా
మారింది. అయితే ఈ విషయంపై టీఎఫ్జేఏ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Journalist #Murthy suspended for 6 months. pic.twitter.com/JGGhohxECe
— Matters Of Movies (@MattersOfMovies) December 11, 2024