Pawan Kalyan | డిఫరెంట్ మ్యానరిజంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అభిమానుల కోసం ఓ వైపు నటుడిగా.. మరోవైపు ఏపీ ప్రజల కోసం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఖాతాలో అరుదైన ఫీట్ చేరిపోయింది.
పవన్ కల్యాణ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2024కిగాను గ్లోబల్లీ (ప్రపంచవ్యాప్తంగా)సెకండ్ మోస్ట్ గూగుల్డ్ యాక్టర్‌గా (Google) పేరు లిఖించుకున్నాడు. 2024 గూగుల్స్ సెర్చ్ డాటా (Google Search Data)లో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడిగా నిలిచాడు పవన్ కల్యాణ్. వరల్డ్ మోస్ట్ తెలుగు గూగుల్డ్ స్టార్‌గా నిలిచి టాలీవుడ్ రేంజ్‌ను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. పాపులర్ అమెరికన్ స్టాండప్ కమెడియన్ Katt Williams మొదటి స్థానంలో నిలిచాడు.
పవన్ కల్యాణ్ అభిమానులు, టాలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీలకు ఇది చాలా ప్రత్యేక విషయమనే చెప్పాలి. పవన్ కల్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ఓజీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లు షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.
ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, సలార్ చిత్రాలు గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ మూవీస్ 2024 జాబితాలో టాప్ 10లో నిలిచాయి.
It’s Rebel Reign on Google Search❤️🔥
Rebel Star #Prabhas‘ biggest blockbusters, #Kalki2898AD and #Salaar, are ranked among the top 10 most searched Indian movies in 2024💥💥 pic.twitter.com/tknLRjDzMB
— BA Raju’s Team (@baraju_SuperHit) December 11, 2024
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్