Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఈ కేసులో మంచు మనోజ్ రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో వినయ్ చేసే పనులు తనకు నచ్చడం లేదన్నాడు. నా తల్లి ఆస్పత్రిలో లేదు.. ఇంట్లోనే ఉన్నారు..నా తల్లి ఆస్పత్రిలో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూర్చుని మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. మిగితా విషయాలు తర్వాత మాట్లాడుతానంటూ చెప్పాడు మనోజ్. కాగా పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంఛ్ మోషన్ పిటిషన్ వేశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. కాసేపట్లో పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
మంచు కుటుంబంలో ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామాలో రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై (journalists) మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు.
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్