Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో వస్తోన్న సినిమా గేమ్‌ఛేంజర్ (Game Changer). బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే నానా హైరానా (Naanaa Hyraanaa) సాంగ్ విడుదల చేశారని తెలిసిందే. ఈ పాట అందమైన లొకేషన్స్ లో రాంచరణ్, కియారా అద్వానీ మధ్య కలర్ఫుల్గా సాగుతుంది. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను, స్టిల్స్‌ను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేశాడు రాంచరణ్. ఈ వీడియో, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF
— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్