Thangalaan | చియాన్ విక్రమ్- స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన తంగలాన్ (Thangalaan) సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సడెన్ సర్ప్రైజ్ ఇంచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ చిత్రం అందుబాటులో ఉన్నది.
1850ల్లో బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. గోల్డ్ హంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్లు మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిచగా, స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.
అయితే తంగలాన్ను ఓటీటీలో విడుదల చేయొద్దంటూ తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా సీన్స్ ఉన్నాయని, బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించారని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కేసు విచారణ అనంతరం ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది.