Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది, ఈ ఘటనలో కాళ్లకు గాయాలవడంతో మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నా భార్యాపిల్లలకు రక్షణ ఉండేందుకే బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా. పోలీసులను ప్రొటెక్షన్ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానన్నాడు. నేను డబ్బు కోసమే, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నాడు. .
మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంచు మనోజ్ పహాడి షరీఫ్‌లో తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఎంట్రీ ఇవ్వగా.. మరి ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచుటౌన్ షిప్లో తాను పదేండ్లుగా నివాసముంటున్నాని మోహన్‌బాబు తన ఫిర్యాదులో తెలిపారు. తన చిన్న కొడుకు మనోజ్, కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తన 7 నెలల కూతురిని వదిలేసి మనోజ్ అతని భార్య బయటకు వెళ్లిపోతారని, ఆ పాపను ఇంట్లో పనిచేసే మహిళనే సంరక్షకురాలిగా ఉంటుందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని పేర్కొన్నారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ నెల 8వ తేదీన ఉదయం సమయంలో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు, కేకలు వేశారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దవాఖానలో చికిత్స చేయించుకున్నానని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్