Pushpa 2 The Rule | అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. అన్ని స్క్రీన్లలో సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీకి చిరంజీవి, సురేఖ దంపతులు స్వీట్ తినిపించి సక్సెస్‌ను సెలబ్రేట్ చేశారు. అయితే నెటిజన్లు షేర్ చేస్తున్న ఈ ఫొటో తాజాది కాదు. అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్న సందర్భంలో తీసినది.
కొందరు నెటిజన్లు పాత ఫొటోలు షేరింగ్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అసలు విషయమేంటంటే చిరంజీవి, అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో కలవలేదని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇక ఫొటో పాతదా.. కొత్తదా అని సంబంధం లేకుండా ఎప్పటిడైతే ఏంటీ..? అన్నట్టుగా కొందరు మూవీ లవర్స్ మాత్రం ఈ స్టిల్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్