Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా వస్తోన్న ఈ మూవీకి బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన జారీ చేశారు మేకర్స్. టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది. మాస్ పేలుడును వీక్షించుకునే మిమ్మల్ని మీరు సన్నద్దం చేసుకోండి.. అంటూ వార్తను అందరితో షేర్ చేసుకుంది బాలకృష్ణ టీం.
ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Get ready for the GRAND PRE-RELEASE EVENT of #DaakuMaharaaj on 4th January at Dallas, Texas! 🇺🇸🤩⚡️
📍Texas Trust CU Theatre, from 6PM Onwards! 💥
Brace yourselves for the ultimate 𝐌𝐀𝐒𝐒 𝐄𝐗𝐏𝐋𝐎𝐒𝐈𝐎𝐍 on Jan 12, 2025 in Cinemas Worldwide. 🤙🏻🔥
Event by @shreyasgroup… pic.twitter.com/XVjBx7mitM
— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2024
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్