Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మోహన్ బాబు స్పందించాడు. మా మీద వస్తున్న వార్తలు అబద్దమని.. ఇటువంటి అసత్య ప్రచారలు చేయొద్దంటూ వార్తలు రాసిన పలు మీడియాలకు సూచించింది.
అసలు ఏం జరిగిందంటే.. మంచు ఇంట్లో వివాదం చెలరేగినట్లు ఉదయం నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. తనపై, తన భార్యపై తన తండ్రి మంచు మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. గాయాలతోనే పీఎస్‌కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబుపై హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు మోహన్ బాబు కూడా మనోజ్‌పై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. తన కొడుకు మంచు మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు న్యూస్ వైరల్ అయ్యింది. ఆస్తులు, స్కూల్ వ్యవహారం విషయంలో ఈ గొడవ అయినట్లు పలు కథనాలు వచ్చాయి.