సిద్దిపేట,మార్చి 18 : బీఆర్ఎస్ హయాం లో సిద్దిపేట నియోజకవర్గంలో రో డ్లు మంజూరై జరుగుతున్న పనులు అర్ధాంతరం గా ఆగిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రెండేండ్లుగా సిద్దిపేట ఆర్అండ్బీశాఖను ఇన్చార్జి అధికారులతో నడిపిస్తున్నారన్నారు. సిద్దిపేట ఈఈ, డీఈ, ఏఈ పోస్ట్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈవిషయంపై పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తరాలు రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాకు ఒక రోడ్డు కూడా మంజూరు చేయలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరై జ రుగుతున్న పనులు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిద్దిపేట రోడ్లకు మోక్షం ఉందా అంటూ సంబంధితశాఖ మం త్రిని ప్రశ్నించారు. సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 80 శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. మిగతా 20 శాతం పనులు పూర్తికాక రాత్రి సమయం లో ప్రమాదాలు జరిగి వాహనదారులు చనిపోతున్నారన్నారు. రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం మీదు గా ఇల్లంతకుంట వరకు నాలుగులేన్ల రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై 70శాతం పూర్తయ్యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయన్నారు. రెండేండ్ల నుంచి రోడ్లపై కనీసం తట్టెడు మట్టి పోయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సిద్దిపేట-చిన్నకోడూరు రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరా రు. నంగునూర్ మండలంలో సీఆర్ఎఫ్ నిధులతో మంజురైనా ముండ్రాయి అంక్షాపూర్ రోడ్డు పనులు 70శాతం పూర్తయ్యాయన్నారు.
బస్సులు పునరుద్ధరించాలి

చేర్యాల, మార్చి 18 : జనగామ నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణాలు చేపట్టి గ్రామాలకు రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో గళమెత్తారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదని, పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయలేదన్నారు.నియోజకవర్గంలో 131 గ్రామా లు, 2 పట్టణాలు, 42 వార్డులు ఉండగా ఎంఆర్ఆర్, సీఆర్ఆర్, పంచాయతీరాజ్, హ్యామ్, ఆర్అండ్బీ రోడ్లపై తట్టెడుమొరం పోయలేదని, మీటర్ రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. జనగామ, చేర్యాల ప్రాంతంలో బస్సుల సమస్య తీవ్రంగా ఉందని, గతంలో నడిచిన విధం గా కాకుండా ట్రిప్పుల సంఖ్య తగ్గించారన్నారు.
బస్సులు వేయాలని జనగామ, హుస్నాబాద్, సిద్దిపేట, హైదరాబాద్‌తో పాటు పలు డిపోల అధికారులను కోరితే రోడ్లు బాగాలేవని నిరాకరిస్తున్నట్లు తెలిపారు.హుస్నాబాద్ వైపు వెళ్లే రోడ్డు వద్ద బ్రిడ్జి మరమ్మతులకు రూ.90 లక్షలు మం జూరు చేయాలని అడిగితే ఆలస్యం చేశారని, ఐదుగురు యువకులు ఆందోళన చేసి జైలుకు వెళ్తే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. హ్యామ్ కింద మంజూరు చేసిన మూడు రోడ్లకు ఇప్పటికీ టెండర్లు పూర్తి కాలేదని, ముస్త్యాల నుంచి వడ్లకొం డ, చేర్యాల నుంచి నాగపురి, రేబర్తి నుంచి కొండాపూర్ పంచాయతీరాజ్ ద్వారా 18 రోడ్లు మంజూరు చేసినా రెండేండ్లలో ఒక్క మీటర్ రోడ్డు నిర్మించలేదన్నారు.
సిద్దిపేట నుంచి దుద్దెడ మీదుగా జనగామ హైవే పనులు పూర్తి కావడం లేదని, కల్వర్టుల వద్ద కృంగిపోయి ప్రమాదకరంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేర్యాల పట్టణంలో జాతీయ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, బచ్చన్నపేటలో రెండు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు తేలాయన్నారు. గజ్వేల్ నుంచి బచ్చన్నపేట మీదుగా హైదరాబాద్ మార్గంలో బస్సులు తగ్గించారని, మద్దూ రు, సలాకాపూర్, ధూళిమిట్ట ప్రాంతాల్లో బస్సులు సగానికి తగ్గించినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు.నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, మంజూరైన రోడ్లకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలని ఆయన డిమాం డ్ చేశారు.
రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలి

నర్సాపూర్,మార్చి18: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బుధవారం అసెంబ్లీలో గళమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెల్దుర్తి నుంచి మెదక్ వరకు వయా పిల్లికొట్టాల మార్గం ద్వారా వెళ్లే రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. నర్సాపూర్ నుంచి మెదక్ వరకు ఉన్న రహదారిని నాలు గు లేన్లుగా విస్తరించేందుకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రహదారి దుస్థితి కారణంగా వెల్దుర్తి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు కూడా ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నర్సాపూర్ నుంచి మెదక్ వరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని డిమాండ్ చేశారు. ఘనపూర్ ఆయకట్టు పరిధిలో ఉన్న పంటలు ప్రస్తుతం చివరిదశలో ఉండగా, నీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగూర్ ప్రాజెక్ట నుంచి ఘనపూర్ ఆయకట్టకు సుమారు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేస్తే లక్ష ఎకరాల్లో ఉన్న పంటలు కాపాడవచ్చన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల పంటలు రక్షించేందుకు అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు.
ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదలచేయాలి
మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటలు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఘనపూర్ ఆయకట్టు పరిధిలో రైతులు వరితో పాటు పలు పంటలు సాగు చేశారన్నారు. ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయని, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్‌కు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, లక్ష ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉందన్నారు.
రైతులు సాగు చేస్తున్న పంటలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వానికి పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని, నీటిపారుదల శాఖ మంత్రి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్దుర్తి నుంచి మెదక్ వరకు పిల్లికొట్టాల మార్గంలో వెళ్లే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. నర్సాపూర్- మెదక్ వరకు రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మాణం చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. మెదక్ వెళ్లేందుకు సరైన రోడ్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.