S.S RAjamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీ షూటింగ్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారం తర్వాత స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉండడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండడంతో మేకర్స్ ఏప్రిల్‌లో సెట్స్ మీదకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్.