Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohanbabu) , కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మంచు మనోజ్ కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో మనోజ్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ వెంట అతడి సతీమణితోపాటు పలువురు ఫాలోవర్లు ఆస్పత్రికి వచ్చిన వారిలో ఉన్నారు.
మనోజ్‌పై మోహన్ బాబు అనుచరుడు వినయ్‌తోపాటు మరికొందరు దాడిచేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా గతకొంతకాలంగా ఆస్తుల విషయమై మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య విభేదాలు కొనసాగుతుండగా.. నేడు ఇదే విషయమై తండ్రీకొడుకులు దాడి చేసుకున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా తమ మీద వస్తున్న వార్తలు అబద్దమని.. ఇటువంటి అసత్య ప్రచారలు చేయొద్దంటూ ఇప్పటికే మీడియాకు విజ్ఞప్తి చేశారు మోహన్ బాబు.
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్