Fear Trailer | బాణం, రూలర్, శివలింగ, కాంచన 3 సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వేదిక (Vedhika). ఈ భామ నటిస్తోన్న తాజా చిత్రం ఫియర్ (Fear). లక్కీ లక్ష్మణ్ నిర్మాత హరిత గోగినేని కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చీకట్లో ముఖంపై చేతులు పెట్టుకొని భయంగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
నాన్న బూచోడు నిజంగానే ఉంటాడా..? అని చిన్నారి అడిగితే నువ్వేం భయపడకు.. బూచోడు ఉండని తండ్రి అంటుండగా.. నిజంగానే బూచోడు ఉన్నాడంటోంది తల్లి. భయంగా ఉంది.. అంటే భయం అనేది మైండ్‌కు సంబంధించింది. స్ట్రాంగ్‌గా ఉండు.. ఫైట్ చేయ్ అంటూ వేదికకు భరోసానిచ్చే సన్నివేశాలతో సస్పెన్స్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ ఆ బూచోడు ఎవరు.. ఏం చేశాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఫియర్ డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది..ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మిస్తుండగా.. సుజాత రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఫియర్ ట్రైలర్..
Fear లుక్..
Thrilled to announce my next film in Telugu #FEAR ❤️🔥@vedhika4u #ARABHI @anuprubens @iandrewdop @GogineniHaritha @DattatreyaMedia
Shoot commences tomorrow! pic.twitter.com/Qjo0DEd3ZR— Vedhika (@Vedhika4u) January 17, 2024
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Suriya 45 | ఏఆర్ రెహమాన్ ఔట్.. సూర్య 45 టీంలోకి యువ కంపోజర్