Baby John trailer | వరుణ్ ధవన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ బేబీ జాన్ (Baby John). నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ కామియో రోల్లో నటిస్తున్నాడు. Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తల్లీకూతుళ్ల ఫన్ జర్నీతో మొదలైన ట్రైలర్.. అమ్మాయిలు, క్రైం చుట్టూ తిరిగే కథాంశం చుట్టూ సినిమా ఉండనుందని హింట్ ఇచ్చేస్తుంది. పోలీసాఫీసర్‌గా నటిస్తోన్న వరుణ్ ధవన్ ఆ క్రైంను ఎలా ఛేదించాడనే నేపథ్యం సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ చివరలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు సల్లూభాయ్.
బేబి చుట్టూ తిరిగే సస్పెన్స్, థ్రిల్లింగ్ కథాంశంతో ఉండే ఈ చిత్రంలో వామికా గబ్బి మరో హీరోయిన్గా నటిస్తోంది. బేబిజాన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ 1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
బేబిజాన్ ట్రైలర్..
Action, fire, and unstoppable GOOD VIBES! 💥
Baby John brings it all! ❤️🔥#BabyJohnTrailer out now!
🔗: https://t.co/2ah28uT3Br#BabyJohn will see you in the cinemas this Christmas, on Dec 25.@MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn @KeerthyOfficial pic.twitter.com/w3k3dZPxeg— Cine1 Studios (@Cine1Studios) December 9, 2024
బేబిజాన్ Baby John Taster Cut..
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Suriya 45 | ఏఆర్ రెహమాన్ ఔట్.. సూర్య 45 టీంలోకి యువ కంపోజర్