Vishwak Sen | ఇటీవలే మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడిక కొత్త సినిమా అప్డేట్తో అందరి ముందుకొచ్చాడు విశ్వక్సేన్. ఇంతకీ నెక్ట్స్ సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తున్నాడనేదే కదా.. మీ డౌటు. జాతి రత్నాలు సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ బ్రేక్ అందుకున్న అనుదీప్ కేవీ (KV Anudeep)తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అంతేకాదు. ఈ సినిమా టైటిల్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ఫంకీ (Funky) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు అనౌన్స్మెంట్ పోస్టర్ ద్వారా చెప్పి క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు అనుదీప్. నేడు పూజా సెర్మనీ జరుగగా.. సంక్రాంతి 2025 తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అనుదీప్ మార్క్ హ్యూమర్ టచ్‌తో సాగే ఎలిమెంట్స్‌తో ఉండబోతున్నదని టైటిల్ లుక్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్