RS Praveen Kumar | హైదరాబాద్ : తన హయాంలో గురుకులాల్లో తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్ళడానికి సిద్ధం.. ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఆకునూరి మురళీ విద్యా కమీషన్ చైర్మన్ కాకముందు ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారు. ఆకునూరి మురళీ ఫుడ్ పాయిజన్‌పై ఎందుకు మాట్లాడటం లేదు. సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలింది. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు. ఒకే జిల్లాలో మూడు సార్లు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. 28 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లకు ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదు. కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునిచ్చారు. గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తాము. గురుకుల బాట పిలుపుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై అవగాహన లేదు. మతిస్థిమితం లేని మంత్రులతో నాపై రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించింది. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ఆర్ఎస్పీ చెప్పారు.
నేను ప్రభుత్వ హాస్టల్స్‌లో చదువుకుని ఐపీఎస్ అయ్యాను. దేశ రక్షణ కోసం పనిచేశాను. ఏడు సంవత్సరాల సర్వీసును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. పోలీస్ యూనిఫార్మ్ పక్కన పెట్టి గురుకులాల సెక్రటరీగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను. గురుకులాలపై రేవంత్ రెడ్డికి, మంత్రులకు శ్రద్ధ లేదు. మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారు. గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. ఆరు నెలల నుండి విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు లేవు. ఫుడ్ పాయిజన్ గురించి కనీస అవగాహన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. మీకు చేతకాకపోతే విద్యా శాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. నేను తొమ్మిది సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా ఉన్నా. నా రికార్డ్ సంక్షేమ భవన్లో భద్రంగా ఉన్నాయి. అధికారం మీ చేతుల్లో ఉంది. ఏసీబీ మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Tiger | ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి దాడి.. రైతుకు తీవ్రగాయాలు