BRS Gurukula Bata | కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. కానీ ఇందుకు గురుకులాల సిబ్బంది సహకరించడం లేదని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకుల పాఠశాల సందర్శనకు శనివారం ఉదయం బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే గురుకుల పాఠశాల గేట్లు మూసివేసి తాళాలు వేసింది.
అంతేకాకుండా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రావొద్దని గురుకుల పాఠశాల బయట యాజమాన్యం ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై యాజమాన్యాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడగ్గా.. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని సమాధానం చెప్పారు. ఆ ఉత్తర్వులు చూపించాలని బీఆర్ఎస్ శ్రేణులు నిలదీయగా.. యాజమాన్యం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో తమను లోపలికి అనుమతించాలని గురుకుల పాఠశాల ఎదుటే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.