Errolla Srinivas | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీనివాస్‌ను మూడు సార్లు విచారణకు పిలిచామని, విచారణకు రాకపోవడంతోనే గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, క్రాంతి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్లోనే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి పరామర్శించారు. శ్రీనివాస్‌ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy Flexi | సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి
Group-1 | గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు