RS Praveen Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. వేలాది మంది దళిత గిరిజన ప్రజలకు కమిషన్ ద్వారా న్యాయం చేసిన వ్యక్తికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసులను ఆర్ఎస్పీ సూటిగా ప్రశ్నించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసే అక్రమం అనుకుంటే, ఆయనకు తోడుగా రక్షణగా వెళ్లిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
తెలంగాణ పోలీసులకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే ముందు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో రేవంత్ బ్రదర్స్‌ను కనీసం ప్రశ్నించండి.. అరెస్టు సంగతి తర్వాత చూద్దాం అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. గజ్వేల్ కేసులో మైనంపల్లి హనుమంతరావు ని ప్రశ్నించండి. షాద్‌నగర్ కేసులో ఎమ్మెల్యే శంకర్‌పై సుమోటో కేసు పెట్టండి. కొల్లాపూర్‌లో ఎనిమిది నెలల క్రితం జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితుల ఆచూకీ కనుక్కోండి. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా మీద కేసు పెట్టండి. మొబిలిటీ వ్యాలీ ఫార్ములా-ఇ రేసు ద్వారా రాష్ట్రానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టండి అని పోలీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు