Group-1 | హైదరాబాద్ : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్-1 ఫలితాలు ప్రకటించొద్దని కోర్టుకు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. ఫలితాలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1 ఫలితాలు ప్రకటిస్తామని ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..