Anaganaga Oka Raju | జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో హీరోగా సూపర్ బ్రేక్ అందుకోవడమే కాకుండా.. తన ఫ్యాన్ బేస్‌ను అమాంతం పెంచేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్పొలిశెట్టి కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) .
చాలా రోజుల తర్వాత నవీన్ పొలిశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రీ వెడ్డింగ్ వీడియో లాంచ్ చేశారు మేకర్స్. రాజుగారి పెళ్లి విందులో చమ్మక్ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి.. గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి.. అంటూ చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ప్రీ వెడ్డింగ్ వీడియో. అతిథుల్లో ఓ వ్యక్తి ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్.. స్వీటు గోల్డ్ అంటున్నారు.. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా అని అడుగుతుంటే.. మరో వ్యక్తి ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని అంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తూ.. ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి.. ముఖేశ్ మామయ్యా ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ పెళ్లి.. వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటున్నాడు. జాతి రత్నాలు హీరో స్టైల్ ఆఫ్ హ్యూమర్ టచ్‌తో సాగుతున్న వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని Fortune Four Cinemas కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ప్రీ వెడ్డింగ్ వీడియో..
Team #AnaganagaOkaRaju wishes the Young Sensation, Star Entertainer @NaveenPolishety a very Happy Birthday! 😉🕺🏻
Here’s the – 𝐏𝐫𝐞 𝐖𝐞𝐝𝐝𝐢𝐧𝐠 𝐕𝐢𝐝𝐞𝐨 ❤️
Non stop SEETIMAAR ENTERTAINMENT blasting into theaters in 2025 😎#HBDNaveenPolishetty… pic.twitter.com/aamy1l6g0x
— BA Raju’s Team (@baraju_SuperHit) December 26, 2024
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ