Drishyam 3 | సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్ట్ దృశ్యం (Drishyam). మోహన్ లాల్ (Mohan lal), మీనా కాంబోలో వచ్చిన ఈ ప్రాంఛైజీలో దృశ్యం 2 కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక మూడో పార్టు కూడా రాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా త్రీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చేశాడు మోహన్ లాల్.
తాము ఇప్పుడిక దృశ్యం 3తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని ఓ చిట్‌చాట్‌లో స్వయంగా చెప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. మేము దృశ్యం 2ను ప్లాన్ చేస్తున్నప్పుడు ఆరేళ్ల తర్వాత కోవిడ్ వచ్చింది. కానీ దృశ్యం 2 మాలీవుడ్‌కు కలిసొచ్చింది. ప్రపంచ నలువైపుల నుండి ఈ సినిమాలను చూశారు. రీసెంట్గా గుజరాత్లో షూటింగ్లో ఉన్నప్పుడు దృశ్యం చూసి అక్కడి వాళ్లు నన్ను గుర్తించారు.
దృశ్యం 2 తర్వాత ఇతర భాషల ప్రేక్షకులు మలయాళ చిత్రాలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఈ ప్రాంచైజీ మలయాళ సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చింది. మేమిక దృశ్యం 3కి ప్లాన్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పనోరమ స్టూడియోస్, గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ అండ్ జోట్ ఫిలిమ్స్ బ్యానర్లు దృశ్యం ప్రాంఛైజీ హాలీవుడ్ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాయని తెలిసిందే. దృశ్యం 1, 2 నిర్మాతల (ఆశీర్వాద్ సినిమాస్) నుంచి అంతర్జాతీయ రీమేక్ రైట్స్‌ను పనోరమ స్టూడియోస్ దక్కించుకుంది. అంతేకాదు దృశ్యం సిరీస్ దక్షిణ కొరియాతోపాటు స్పానిష్ వెర్షన్లో కూడా సందడి చేయనుంది.
Max Trailer | ప్రతీ పకోడిగాడు సమాజ సేవకుడే.. స్టన్నింగ్‌గా కిచ్చా సుదీప్ మాక్స్ ట్రైలర్
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్