Pooja Hegde | టాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించిన ముంబై భామల్లో టాప్‌లో ఉంటుంది పూజాహెగ్డే (Pooja Hegde). ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ఈ భామ మరోవైపు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండే పూజాహెగ్డేకు 2024 మాత్రం మరిచిపోలేని సంవత్సరంగా మిగిలిపోతుందనే చెప్పాలి.
ఎందుకంటే ఈ ఏడాది పూజాహెగ్డే నటిస్తోన్న ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. సల్మాన్ ఖాన్‌తో నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ 2023 ఏప్రిల్‌లో విడుదలైంది. అప్పటి నుంచి ఈ భామ నుంచి కొత్త సినిమా ఏం విడుదల కాలేదు. ఈ లెక్కన ప్రొఫెషనల్‌గా బిజీగా ఉండే పూజాహెగ్డేకు 2024 జీరో ఇయర్‌గా మిగిలిపోయిందనే చెప్పాలి.
పూజాహెగ్డే ప్రస్తుతం దేవా, సూర్య 44, దళపతి 69 సినిమాల్లో నటిస్తోంది. దీంతోపాటు హాయ్ జవాని తో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తోంది. వీటిలో దేవా, సూర్య 44 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. దళపతి 69, హాయ్ జవాని తో ఇష్క్ హోనా హై షూటింగ్ దశలో ఉన్నాయి.
2020లో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ బోల్తా కొట్టగా.. బీస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మళ్లీ సూపర్ హిట్ కొట్టారనే కసితో వరుస సినిమాలతో బిజీగా మారింది.
KTR | మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది: కేటీఆర్
Keerthy Suresh | తగ్గేదే లే.. బేబిజాన్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో కీర్తిసురేశ్