Bollywood 2024 | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై కోవిడ్ -19, లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంతలా పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోవిడ్ కారణంగా థియేటర్ల వ్యవస్థ దెబ్బతినడంతో చాలా కాలం పాటు ప్రేక్షకుల రాకపోవడంతో హిందీ సినిమా (Hindi Movies)లకు ఆదరణ కరువైపోయింది.
అయితే 2024 మాత్రం బాలీవుడ్‌కు ఆశాజనకమైన ఏడాదిగా చెప్పొచ్చు. అప్పటిదాకా దక్షిణాది సినిమాల హవా మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో.. బీటౌన్‌కు ఈ ఏడాది మాత్రం హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాలను అందించింది. 2024లో అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ 10 హిందీ సినిమాలపై ఓ లుక్కేస్త్త్
స్త్రీ 2 :
శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబోలో వచ్చిన సీక్వెల్ ‘స్త్రీ 2’ (Stree 2). హార్రర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.874.58 కోట్లు గ్రాస్ సాధించింది.
భూల్ భూలైయా-3 :
కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) నటించిన హార్రర్ కామెడీ ప్రాంఛైజీ త్రీక్వెల్ భూల్ భూలైయా-3 (Bhool Bhulaiyaa 3). అనీశ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబర్1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.417.51 కోట్లు రాబట్టింది.
సింగం అగెయిన్ :
రోహిత్ శెట్టి పాపులర్ కాప్ యూనివర్స్ సింగం ప్రాంచైజీలో వచ్చిన చిత్రం సింగం అగెయిన్ (Singham Again). బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ (Ajay devgn) టైటిల్ రోల్లో నటించగా. అక్షయ్ కుమార్, రన్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.389.64 కోట్లు రాబట్టింది.
ఫైటర్ :
బాలీవుడ్ స్టార్ యాక్లర్లు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). భారత తొలి ఏరియల్ డ్రామా నేపథ్యంలో సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన చిత్రం ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 344.46 కోట్లు వసూళ్లు చేసింది.
సైతాన్ :
అజయ్ దేవ్గన్, ఆర్ మాధవన్, జ్యోతిక (Jyothika) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం సైతాన్ (Shaitaan). వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రాగా.. గ్లోబల్ వైడ్‌గా రూ.211.06 కోట్లు రాబట్టింది.
Crew :
బాలీవుడ్ భామలు కరీనాకపూర్ (Kareena Kapoor), టబు (Tabu), కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం Crew. లూట్ కేస్ ఫేం రాజేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. హీస్ట్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.157.08 కోట్లు రాబట్టింది.
Munjya :
కామెడీ హర్రర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆదిత్య సర్పోట్దర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ముంజ్యా. షార్వరీ, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ రూ.132.13 కోట్లు వసూళ్లు చేసింది.
Bad Newz :
విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri), అమ్మి విర్క్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం బ్యాడ్ న్యూజ్ (Bad Newz). ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 19న థియేటర్లలో విడుదలై.. గ్లోబల్ వైడ్‌గా
రూ.115.74 కోట్లు రాబట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్యాడ్ న్యూజ్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఆర్టికల్ 370 :
యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఆర్టికల్ 370’ (Article 370). నేషనల్ అవార్డ్ విన్నర్ ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.110.57 కోట్లు వసూళ్లు చేసింది.
Teri Baaton Mein Aisa Uljha Jiya :
షాహిద్ కపూర్ కృతిసనన్ నటించిన చిత్రం Teri Baaton Mein Aisa Uljha Jiya. అమిత్ జోషి, ఆరాధన షా డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 133.64 కోట్లు రాబట్టింది.
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్
Shankar | గెట్ రెడీ అంటోన్న శంకర్.. థియేటర్లలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3