Akkineni Nagarjuna – CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చడంతో పాటు తన ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్నిరోజులుగా కోపంగా ఉన్న అగ్ర నటుడు నాగార్జున నేడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి దూరంగా ఉంటే.. నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. అయితే నాగార్జున రావాడమే కాకుండా రేవంత్ రెడ్డిన శాలువతో సత్కరించాడు. దీంతో ఎన్ కన్వెన్షన్ వివాదంకు సంబంధించి నాగార్జున సైలెంట్ అయ్యాడా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున వెళ్లి కలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ భేటీలో ఇండస్ట్రీకి సంబంధించి నాగార్జున పలు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్ ఉండాలని.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటీవ్స్ ఇస్తేనే పరిశ్రమ ఎదుగుతుందని.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావలన్నది మా కోరిక అని నాగార్జున తెలిపినట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..
అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల్చివేసిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతలో భాగంగా.. చెరువును కబ్జా చేశారంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చారు. అయితే దీనిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు కూడా వేశారు. అలాగే దీనిపై మాట్లాడుతూ.. నేను ఏ చెరువును ఆక్రమించి కట్టలేదు. ఈ విషయంలో న్యాయం దొరికేవరకు పోరాడతాను అంటూ నాగార్జున ప్రకటించాడు.
అయితే ఈ వివాదం సద్దుమణగకముందే.. అక్కినేని ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేసింది మహిళ మంత్రి కొండా సురేఖ. నటులు నాగ చైతన్య, ఆయన మాజీ భార్య సమంతల విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కారణమని ఆమె ఆరోపించింది. అంతేగాకుండా.. కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగారు. అయితే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ పరిశ్రమ మొత్తం కొండ సురేఖపై దుమ్మెత్తిపోసింది. అగ్ర నటులు చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. దాంతో దిగొచ్చిన మహిళా మంత్రి అక్కినేని కుటుంబానికి, సమంతకు క్షమాపణలు తెలిపింది. ఈ విషయంపై నటుడు నాగార్జున అక్టోబర్ 4న మంత్రిపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుంది.
Also Read..