CM Revanth Reddy | అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే: సీఎం రేవంత్
శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని చెప్పారు. మహిళల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చొరవ చూపాలన్నారు. టెంపుల్, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలన్నారు. అన్ని అనుమతులుఉంటేనే సినీ ఇంవెంట్లు నిర్వహించుకోవాలని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. ఒక మహిళ ప్రాణం పోవడంతోనే సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు. ఎవరిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

