Tollywood Industry Meeting | టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపాడు.
హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిలిం హబ్‌గా మార్చడానికి కృషి చేస్తాం. తెలంగాణ సామాజిక కార్యక్రామల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి సహకారం ఉండాలని ప్రభుత్వం కోరింది. డ్రగ్స్, గంజాయి లాంటి ఆవగాహన కార్యక్రమాల్లో ఇకనుంచి నటీనటులు పాల్గోంటారు. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విషయం. ఆ రెండింటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఘటనల వలన ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది అది నిజం కాదు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.