Aamir Khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ (Aamir Khan). ప్రస్తుతం నిర్మాతగా, యాక్టర్‌గా బిజీగా ఉన్న అమీర్ ఖాన్ హీరోగా సితారే జమీన్ పర్ చేస్తున్నాడు. తాజాగా తన వ్యసనాల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు అమీర్ ఖాన్. తన కెరీర్లో ఒక్కోసారి రాత్రంతా తాగేవాడినన్నాడు. బీటౌన్ మిస్టర్ పర్ఫెక్ట్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. అమీర్‌ఖాన్ తనకు తాను అంతర్గతంగా చాలా సమస్యలతో పోరాడాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
ఓ చిట్‌చాట్‌లో దీని గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మద్యానికి బానిసను. అంతేకాదు నేను రాత్రంతా తాగిన సందర్భాలు ఉన్నాయి. నా వ్యక్తిగత ఆరోగ్యం, శ్రేయస్సుతో సంబంధం లేకుండా స్మోక్ చేసేవాడిని. ఈ అలవాట్లు నా జీవితానికి, నా కెరీర్‌కు కూడా హానికరమని నాకు బాగా తెలుసు, కానీ నేను మాత్రం వాటిని అంతం చేయలేకపోయాను. ఈ క్రమంలో నేను సినిమాను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. అదే నా జీవితాన్ని మార్చింది. సినిమా పట్ల నాకున్న ప్రేమ నా వ్యసనాలకు చెక్ పెట్టేలా చేసింది. అలా చివరికి నా అలవాట్లను వదిలిపెట్టానంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్.
సితారే జమీన్ పర్ సినిమాకు అమీర్ ఖాన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు రజనీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తోన్న కూలీలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. హోంబ్యానర్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌పై సన్నీడియోల్, ప్రీతి జింటా కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా లాహోర్ 1947 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Allu Aravind | శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం : అల్లు అరవింద్
Dil Raju | కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ