Dil Raju | కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
Dil Raju | ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలైన శ్రీతేజ్ (Sreetej) కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. తాజాగా దిల్ రాజు ఇవాళ అల్లు అరవింద్‌తో కలిసి మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.
Dil Raju | ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ (Sandhya theatre stampede) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలైన శ్రీతేజ్ (Sreetej) కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. తాజాగా దిల్ రాజు ఇవాళ నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.
శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం అతని తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నారు. శ్రీతేజ్ తండ్రికి దిల్ రాజు, అల్లు అరవింద్ ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం..
దిల్ రాజు మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ కోరాం. రేపు లేదంటే ఎల్లుండి సీఎం రేవంత్‌రెడ్డి కలుస్తాం. అల్లు అర్జున్ను కూడా కలుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తా. రేవతి కుటుంబం వినోదం కోసం థియేటర్‌కు వెళ్లారు. కావాలని ఎవరైనా ఇలా చేస్తారా..? అన్నారు దిల్ రాజు.
రేవతి భర్త భాస్కర్‌కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డీసీ ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమన్నారు దిల్ రాజు.
Read Also :
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

