Palle Ravikumar Goud | హైదరాబాద్ : విద్యార్థి ఉద్యమ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ప్రజల కోసం పనిచేసే వారి ఇళ్లల్లోకి పోలీసులే దొంగల్లా చొరబడి అరెస్టులు చేయడమా? అని ఆయన ప్రశ్నించారు. సమయం, సందర్భం లేకుండా.. ఎప్పుడంటే ఎప్పుడు అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం నిజాయితీ, నిబద్ధతతో కొట్లాడినవాడు. బహుజనుల అభ్యున్నతి కోసం ఆరాటపడే యోధుడు అని రవికుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సబ్బండ వర్గాలకు చేసిన వంచనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమే ప్రజా పాలననా? ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటి? అరెస్టు చేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పల్లె రవి కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manda Jagannadham | విషమంగా మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్యం..