Vasudeva Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారకముందే అరెస్టులు చేయడం ఏందీ? అని ప్రశ్నించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏమైనా బందిపోటా? ఉగ్రవాదా? గజదొంగనా? అని నిలదీశారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడమే ప్రజా పాలననా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించడం ఈ ప్రభుత్వంలో లేనట్టు కనిపిస్తుంది? నిజంగా నేరం చేసి ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వండి? అరెస్టు చేయాలంటే అరెస్ట్ వారెంట్ చూయించండి? ఇవేమి లేకుండా ఉగ్రవాది లెక్క తెల్లవారకముందే ఇంటికి వచ్చి పట్టుకెళ్ళడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యక వాదులందరూ ఖండించాల్సిన అరెస్ట్ ఇది కేతిరెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తేలేవని ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులు చేయడము ప్రజా పాలనలో కామన్ అయిపోయింది. అరెస్టులతో బెదిరింపులతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, బ్లాక్మెయిల్ దందాలు రాష్ట్రంలో శరమాములైపోయాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ సమయములో ప్రజలంతా ఏకధాటిపై ఉండి అన్యాయం ఎదిరించాల్సిందే. న్యాయం కోసం పోరాడాల్సిందే. ఆ పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు, గొంతు నొక్కడాలు ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు ప్రజల పక్షాన నిలబడతాం.. నిలదీస్తాం.. కొట్లాడుతాం. అరెస్టు చేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాసులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాని కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manda Jagannadham | విషమంగా మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్యం..
Harish Rao | సీఎం రేవంత్.. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు: హరీశ్‌రావు