Harish Rao | సీఎం రేవంత్.. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు: హరీశ్‌రావు
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా.. పోలీస్ రాజ్యమా? అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అంటూ విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. సెలవు రోజుల్లో కావాలని బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?
అడిగితే అరెస్టులు..
ప్రశ్నిస్తే కేసులు..
నిలదీస్తే బెదిరింపులు…బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి…
— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

