ఆదిలాబాద్ : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తండాకు చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం(BRS Farmer Suicide Study Committee)పరామర్శించింది. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సభ్యులు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జోగు రామన్న ఎమ్మెల్సీలు ఎంసీ కోటి రెడ్డి, యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ బాధిత కుటుంబం సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యయన కమిటీలు నియమించారన్నారు. అందులో భాగంగా నేడు ఇక్కడికి వచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మృతుడు గజానంద్ కుటుంబానికి సొంత డబ్బులు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలను, రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. త్వరలోనే కేసీఆర్ నాయకత్వంలో మంచి వస్తాయన్నారు.
సహాయం అందజేస్తున్న అనిల్ జాదవ్
ఇవి కూడా చదవండి..
Beerla Ilaiah | ప్రభుత్వ విప్ ఐలయ్యకు నిరసన సెగ.. అర్హులైన వారి పేర్లను ఇప్పుడే ప్రకటించాలని సవాల్
Grama sabhalu | కన్నీళ్లు, వేడుకోళ్లు, ఆగ్రహ జ్వాలలు.. చివరి రోజు రణరంగంగా మారిన గ్రామ సభలు
KTR | అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి : కేటీఆర్