KTR | హైదరాబాద్ : జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అమ్మాయిలకు శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి అని కేటీఆర్ పేర్కొన్నారు. ధైర్యవంతులైన, తెలివైన అమ్మాయిలు.. మీరే భవిష్యత్.. ప్రకాశిస్తూ, కష్టపడుతూ, ప్రపంచాన్ని మారుస్తూ ఉండండి అని కేటీఆర్ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా, మీ అందరితో ఒక రహస్యాన్ని పంచుకుంటాను.. ఈ ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. పెద్ద కలలు కలిగిన చిన్నారులు మీరే అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పాలించండి.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించినా విశ్రమించకండి.. మీరు కచ్చితంగా ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, అద్భుతమైన ప్రదేశంగా మార్చుతారు అని కేటీఆర్ కొనియాడారు.
Empower a girl, change the world!
To all the brave & brilliant girls: you’re the future! Keep shining, striving & changing the world!
As we celebrate National Girl Child Day, let me share a secret with all of you – the best people in this world are little girls with big… pic.twitter.com/1lxfnUmisc
— KTR (@KTRBRS) January 24, 2025
ఇవి కూడా చదవండి..
Sangareddy | కూలిన అంగన్వాడీ సెంటర్ పైకప్పు.. నలుగురు పిల్లలకు గాయాలు
KTR | ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్