Sangareddy | సంగారెడ్డి : అభం శుభం తెలియని చిన్నారులు చదువుకునే అంగన్వాడీ సెంటర్లో ప్రమాదం చోటు చేసుకుంది. పైకప్పు పాక్షికంగా కూలింది. ఈ శిథిలాలు మీద పడడంతో నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక అంగన్వాడీ సెంటర్లో ఉన్న మిగతా పిల్లలను వారి నివాసాలకు పంపించారు. ఈ ఘటనపై మండల అధికారులు ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Maha Kumbh | కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు