KTR | హైదరాబాద్ : రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగని విషయం వాస్తవమే.. నేరడిగుంటలో 345 మంది రైతులకు రూ. 2.81 కోట్ల రుణమాఫీ వర్తించింది. ఇంకా 127 మంది రైతులకు మాఫీ కావాల్సి ఉన్నది అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో.. పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సన్నాసులు ఎవరో.. సమర్థులు ఎవరో.. అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో.. మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడు! రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని అని కేటీఆర్ తెలిపారు.
రేవంత్.. కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్‌లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ఓ బూటకం.. సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం.. కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో…
పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో..
సన్నాసులు ఎవరో..సమర్థులు ఎవరో..
అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో..మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడు!
రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని!
రేవంత్..… pic.twitter.com/ht9kDQUHEb
— KTR (@KTRBRS) January 24, 2025
ఇవి కూడా చదవండి..
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన
Dense Fog | హైదరాబాద్‌ను కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
Congress | మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో గ్రామసభల చిచ్చు