ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది. ముందుగా గుడిహత్నూర్ మండలం నేరడిగోండ తండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణిగుంట రైతు దేవరావు కుటుంబ సభ్యులతో కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం రాకుమారిలో మిర్చి పంటను పరిశీలించి యాపాలగూడలో రైతులతో సమావేశమవుతారు.
జిల్లాలో 33 మంది రైతుల ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలో 13 నెలలల్లో 33 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక దేవ్రావు బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 30 వేల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కావాల్సి ఉండగా, రెండు పంటలకు రైతు భరోసా అందలేదు.
దీంతో రైతులు సాగు కోసం బ్యాంకులు, ప్రైవేటు, దళారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తున్నది. దిగుబడులు లేక అప్పులు తీర్చక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 90 శాతం రైతులు పత్తి సాగు చేస్తారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521తో కోనుగోలు చేయాల్సిన సీసీఐ రైతులను నట్టేట ముం చుతున్నది. నాణ్యత పేరిట క్వింటాలుకు రూ.100 తగ్గించి ,421తో కొనుగోలు చేస్తున్నది.