హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 7 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉన్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓ వైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా వెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులుప్రయణిస్తున్నారు. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. కరీంనగర్ హైవేపై శామీర్‌పేట పరిసరాల్లో మంచు దుప్పటి పరుచుకున్నది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో దట్టంగా పొగమంచు అలముకున్నది. నార్కట్‌పల్లి-అద్దంకి రోడ్డుపై మంచుతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇత మంచును గతంలో ఎప్పుడూ చూడలేదని వాహనదారులు అంటున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా పొగమంచు భారీగా కురుస్తున్నది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రన్‌వే కనిపించకపోవడంతో బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నది.