హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు. ఎంపీ రవిచంద్ర గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge )సహ వ్యవస్థాపకుడు రాఘవ, ప్రతినిధి సతీష్ సహకారంతో తన సన్నిహితులు మర్రి రంగారావు, నీలం దుర్గేష్, వేల్పుల రాజమల్లుతో కలిసి రెండు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. పుట్టినరోజులు, ఇతర శుభదినాల సందర్భంగా మొక్కలు నాటడడం అనేది పుణ్య కార్యమన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఎంతో మంది స్ఫూర్తినిపొంది ఇప్పటివరకు 17 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ఎంపీ వివరించారు.