కోదాడ, ఫిబ్రవరి 27 : కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో సీఈసీ గురుకుల చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం కోదాడ పట్టణంలో సమ్మేళనమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రి ప్రగడ భారత రావు, సిహెచ్ ప్రభాత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. మానవ రక్త సంబంధాలు కనుమరుగుతున్న నేటి సమాజంలో 50 ఏళ్ల క్రితం తమ వద్ద చదువుకున్న విద్యార్థులు తిరిగి కలుసుకోవడం అభినందనీయమన్నారు. వివిధ ప్రాంతాల్లో తమ జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మనవలు, మనవరాళ్లతో గడుపుతున్నా పూర్వ విద్యార్థులు తమను గుర్తు పెట్టుకుని సత్కరించడం మరిచిపోలేని మధురానుభూతి అన్నారు. ఈ వేడుకలో ఆంగ్ల ఉపన్యాసకురాలు మేరీ కుట్టి జోసెఫ్, పూర్వ విద్యార్థులు కేసన్ ప్రసాద్, చెన్నకేశవరావు, వెంకటాద్రి ప్రభాకర్, కృష్ణారెడ్డి, భిక్షం, బోధనేతర సిబ్బంది అల్లా భిక్షం, బహదూర్, నారాయణ పాల్గొన్నారు.